Post Details

ఇరాన్‌ చమురుకు చెల్లు!

న్యూఢిల్లీ: ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను మన దేశం నిలిపివేయనుంది. ఇరాన్‌పై గతేడాది ఆంక్షలు విధించిన అమెరికా భారత్, చైనా సహా కొన్ని దేశాలకు మాత్రం దిగుమతులకు మినహాయింపు కల్పించింది. అయితే, త్వరలోనే ఈ మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నట్టు, ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.